మా రైతులు, గ్రామ ఉత్పత్తిదారులు మరియు చేతివృత్తులవారి సాంప్రదాయ మౌలిక సదుపాయాలను కొనసాగించడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాము. మా వినియోగదారులకు కూడా దీనిని పరిచయం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. రైతు నుండి వినియోగదారునికి ఆరోగ్యకరమైన సరఫరా గొలుసును ఏర్పాటు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము, ఇది రైతులకు ఉత్తమ ధరను అందిస్తుంది.
వ్యవసాయ ఉత్పత్తులు రైతులు మరియు ఉత్పత్తిదారుల నుండి అంతిమ వినియోగదారునికి చేర్చే క్రమములో ఉండే సేకరించడం, గ్రేడింగ్, ప్రాసెసింగ్, సంరక్షించడం మరియు రవాణా చేయడం లాంటి వ్యవసాయ మార్కెటింగ్‌లో మేము అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము. అలాగే రైతులకు వినూత్న వ్యవసాయ పద్ధతులపై తాజా విషయాలు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నాము.