
మై విలేజు (మన ఊరు మన అంగడి) - కాన్సెప్ట్ డ్రైవ్ 2024 ఒక సరికొత్త భావన గా ఆవిష్కరించ బడుతుంది. గ్రామాలను పట్టణాలు, నగరాలు మరియు మెట్రోపాలిటన్లతో అనుసంధానిస్తు ఒక సామాజిక అమ్మకపు వేదికను సృష్టించడం జరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు , సేంద్రియ మరియు చిరు ధాన్యాల ఉత్పత్తులు, పాలు, గుడ్లు మరియు మాంసోత్పత్తులు, స్వయం ఉపాధి వ్యక్తులు మరియు స్వయం సహాయక బృందాలలో నిమగ్నమైన రైతులందరికీ వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఉపయోగపడే పబ్లిక్ బ్రాండుని సృష్టించడం మై విలేజు (మన ఊరు మన అంగడి) - కాన్సెప్ట్ డ్రైవ్ 2024 యొక్క ప్రధాన ఉద్దేశ్యము.