నేపథ్యం
వ్యవసాయంలో కొన్ని సంవత్సరాల అనుభవం మరియు నేర్చుకోవడం తరువాత , ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు గల మొత్తం ప్రక్రియ సమయం మరియు కాలానుగుణంగా క్రియాశీలకంగా మారుతుంది. ఈ దృష్టాంతంలో రైతుకు తాజా పరిస్థితులు, సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోవడమే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మారడము అనివార్యం అవుతుంది.
నేటి తరానికి చెందిన విద్యావంతులైన రైతు కూడా భిన్నంగా ఆలోచించలేకపోతున్నారు. రైతులు ఎకరానికి లాభదాయకత కంటే ఎకరానికి దిగుబడిపై దృష్టి సారించడం, సంవత్సరానికి ఇన్పుట్ ఖర్చులు పెరగడం కంటే ఉత్పత్తి యొక్క ద్రవ్య విలువపై మాత్రమే దృష్టి పెట్టడం, రైతుకు దీర్ఘకాలిక విలువ లేని సబ్సిడీలు, ఎంఎస్పి మొదలైన వాటిపై ఎక్కువ ఆధారపడటం . రైతు ప్రతి సంవత్సరం విత్తనాలు, ఎరువులు మరియు తెగుళ్ళ కోసం డబ్బును వృధా ఖర్చు చేస్తూనే ఉంటాడు, హరిత విప్లవం తరువాత కాలక్రమేణా వాటిని స్వయం సమృద్ధి నుండి ఆధారపడేవారికి తరలించేలా చేసింది.
రైతులు ఖర్చులు తగ్గించడము, మొత్తం దిగుబడి, ఒకటే పంట నుండి బహుళ పంటలకు వెళ్లడం, సమగ్ర వ్యవసాయం, విలువ పెరిగేలా సరఫరా గొలుసును మెరుగుపరచడం మరియు అంకితమైన వినియోగదారులని కలిగి ఉండడము వంటి పద్ధతులను అవలంబించడంపై దృష్టి పెట్టడం అవసరం.
లక్ష్యము :
కొత్త తరములో అనుభవజ్ఞులైన రైతులు వారి సమయం మొత్తం ఇన్పుట్ ఖర్చులను తగ్గించడం, వ్యర్థాలను తగ్గించడం, విలువ ఆధారిత ఉత్పత్తులను మెరుగుపరచడం మరియు ఉత్పత్తుల నాణ్యతపై రాజీ పడకుండా రైతు ఆదాయాన్ని పెంచడం కోసం అర్ధవంతమైన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.
రసాయనాలు ఉపయోగించకుండా ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి సరైన మార్గం, రసాయన రహిత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి రైతులు "నేర్చుకోవటానికి నేర్చుకోవాలి". మరియు మంచి ఆహారాన్ని ఉత్పత్తి చేయడమే కాదు, చివరి మైలు వరకు కొనసాగించాలి.
1. ప్రణాళిక
2. దున్నడము
3. విత్తడం
4. కలుపు తీయుట
5. కార్మిక నిర్వహణ
6. పంట కోత
7. నిల్వ
8. లాజిస్టిక్స్ మరియు రవాణా
9. ప్రాసెసింగ్
10. విలువ జోడించిన ఉత్పత్తులు
11. మార్కెటింగ్
దేశంలోని వివిధ రాష్ట్రాలలో విజయవంతమైన మరియు వైఫల్య నమూనాలను అధ్యయనం చేసిన తరువాత, పరస్పర సహకార సంఘము లేదా సమానమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం అత్యంత ఆచరణీయమైన నమూనాగా భావించి , వివిధ ప్రదేశాల నుండి రైతులు మరియు ఔత్సహిక వ్యవసాయ పారిశ్రామికుల తో సాధారణ ఎజెండాతో కలిసి పనిచేయడానికి రైతు ప్రొడ్యూసర్ కంపెనీ స్థాపించదలిచాము.
ప్రస్తుత పరిస్థితులలో రైతుకు మెరుగైన ధరను అందించడం అవసరం, ఇది సరఫరా వ్యవస్థ పై దృష్టి పెట్టకుండా సాధ్యం కాదు. సాంప్రదాయిక ప్రక్రియతో పోల్చితే వ్యర్థాలను తగ్గించడం, మంచి ధర నిర్ణయించడం, తుది వినియోగదారులను చేరుకోవడం, విలువ జోడించిన ఉత్పత్తులు మరియు మంచి ధర పొందడానికి సరఫరా గొలుసు సహాయపడుతుంది. రైతులను "రిటైల్-టు-హోల్‌సేల్ మోడల్" నుండి "రిటైల్-రిటైల్ మోడల్" కు తరలించేలా చేయడం రైతు సంపద ముఖ్యోద్దేశ్యము.
సమూహాన్ని ఏర్పాటు చేసే నమూనా కొత్తది కానప్పటికీ, రైతాంగము కలిసి కట్టుగా లేనందున వర్తక సంఘం దోపిడీకి గురవుతున్నది. సరఫరా గొలుసు అమలులో ప్రణాళిక, సమన్వయం, నిల్వ స్థలం, ప్రాసెసింగ్ మెషినరీ, లాజిస్టిక్స్, టెక్నాలజీ మొదలైనవి ఉంటాయి, వీటికి పెద్ద ప్రారంభ మూలధనం అవసరం, ఇది రైతు సమాజానికి ప్రధాన అవరోధంగా పరిగణించబడుతుంది.
ఒకే ఉద్దేశ్యము కలిగిన వ్యక్తులు ఒక గ్రూపుగా ఏర్పడి, సమస్య ఎక్కడ ఉందో గుర్తించడంతో పాటు , ఉద్యోగాలు చేస్తూ వ్యవసాయం చేస్తున్న రైతులతో పాటు ఔత్సహిక వ్యక్తులు, వ్యాపారములో మరియు సేవ రంగంలో ఉన్న వ్యక్తులు కలిసి ఒక సమూహాన్ని ఏర్పాటు చెయ్యడము ద్వారా గొప్ప అనుభవాన్ని తెస్తుంది మరియు లక్ష్యాన్ని అమలు చేయడానికి సులభంగా ఉంటుంది.
అందువల్ల ఇవ్వన్నీ సాధించడానికి వివిధ దశలుగా విభజించి చేపట్టాల్సి ఉంటుంది. ద్రుష్టి పెట్టాల్సిన విషయాలు క్రింది విదంగా ఉంటుంది :
మొదటి దశ : రైతు మరియు వినియోగదారుల మధ్య అంతరాలను పూరించడం.
1. సహజ రైతుల సమాచారం సేకరించడము మరియు వారిని చిన్న సమూహాలుగా ఏర్పరచడము.
2. ఉత్పత్తులను ఒకే చోట సేకరించడానికి ఆచరణీయ రవాణా మార్గం ఆధారంగా రైతులను కలపడము.
3. ఒకే చోట పలు రకాల పండ్లు మరియు కూరగాయలు, ధాన్యాలు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి ఉత్పత్తి చేయడానికి రైతులతో కలసి పని చెయ్యడము.
4. సేకరణ కేంద్రాలను నెలకొల్పుతూ, నిల్వ కేంద్రాలు, పంపిణి మరియు అమ్మకపు కేంద్రాలను కలుపుతూ చివరి వరకు ఉత్పత్తుల సరఫరాను నిర్వహించడము.
5. నెమ్మదిగా పాడైపోయే వస్తువుల కోసం నిల్వ యూనిట్లను నిర్వహించడము.
6. వస్తువుల ప్యాకేజింగ్ మరియు పంపిణీ.
8. రైతులకు లాభదాయకమైన నమూనాను ప్రాంభించడము.
9. ఉత్పత్తుల కోసం బి 2 బి మరియు బి 2 సి మార్కెట్‌లను నిర్మించడము.
రొండవ దశ : ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు బ్రాండింగ్‌ను ప్రారంభించడం
1. వివిధ ఆహార ధాన్యాల ప్రాసెసింగ్ యొక్క మౌలిక సదుపాయాలను సృష్టించడము.
2. ప్రాసెస్ చేసిన వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా లాభాలను మెరుగుపరచడము. .
3. మంచి ధరల కోసం ప్రీమియం పరిధిని సృష్టించండము.
4. మరిన్ని సేకరణ మరియు పంపిణి కేంద్రాలను ఏర్పరచడము.
5. ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ రంగాల ఉత్పత్తులకు కలిపి పరిధిని పెంచడము.
6. దేశీ విత్తన బ్యాంకులను నిర్మించడము.
7. చిన్న సాధనాలు మరియు యంత్రాల మౌలిక సదుపాయాలను కల్పించడము.
మూడవ దశ: ఏకీకృతం చెయ్యడము మరియు విస్తరించడము.
1. మంచి విలువ వచ్చేలా బ్రాండ్‌ను స్పృష్టించడము.
2. రైతు ఉత్పత్తులను మాత్రమే అమ్మే అమ్మకపు పాయింట్లను స్పృష్టించడము.
3. సమీప నగరాల్లోకి కూడా ఫై నమూనాలను తీసుకెళ్ళడము.
4. ఎగుమతి మార్కెట్‌ను స్పృష్టించడము.
5. తాజా యంత్రాల మౌలిక సదుపాయాలను స్పృష్టించడము.